- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Collector Rizwan Basha : సాంకేతిక లోపాన్ని వెంటనే పరిష్కరించి రైతులకు సహకరించాలి
Collector Rizwan Basha : సాంకేతిక లోపాన్ని వెంటనే పరిష్కరించి రైతులకు సహకరించాలి
by Chintha Aamani |
దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలోనీ

X
దిశ,దేవరుప్పుల : దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి గ్రామంలోనీ ఏపీజీబీ బ్యాంక్ గత మూడు రోజులుగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ కారణంగా రైతులకు రుణమాఫీ, రెన్యువల్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా బుధవారం బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు మూడు రోజుల నుంచి సాంకేతిక లోపం వల్ల రైతులకు రుణాలు ఇవ్వడం ఆగిపోవడం జరిగిందనీ, ఏపీజీబీ బ్యాంక్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ తో మాట్లాడగా సమస్యని వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన రుణాలను మంజూరు చేస్తామని బ్యాంక్ మేనేజర్ కలెక్టర్ కు తెలిపారు. వారి వెంట తహశీల్దార్ హుస్సేన్, వెంకటేశ్వర్లు,రాజు,సాగర్,సీపీఎం నాయకులు సింగారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






