విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్.. ఇంతకీ ఎక్కడంటే..?

by Naveena |

మండల కేంద్రములోని లయోల హైస్కూల్ లో దారుణం చోటు చేసుకుంది.

విద్యార్థిని దారుణంగా కొట్టిన టీచర్.. ఇంతకీ ఎక్కడంటే..?
X

దిశ ,పర్వతగిరి: మండల కేంద్రములోని లయోల హైస్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని టీచర్ వాతలు వచ్చేలా కొట్టింది. పర్వతగిరి గ్రామానికి చెందిన రూపాని సాయికుమార్, వర్షిని ల కూతురు లిప్సిక(5) ఎల్ కేజి చదువుతుంది. రోజులాగానే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లిన లిప్సిక ను టీచర్ రమ కట్టేతో కోట్టడంతో.. ఒళ్లంతా వాతలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి మేనమామ అయిన ఉపేందర్ కు తెలుపగా.. స్కూలుకు వెళ్లి యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. చిన్న పిల్లను కొట్టడం ఏంటని.. గతంలో ఒకటి రెండు సార్లు ఇలా జరిగినా కానీ యాజమాన్యానికి చెప్పిన ఏలాంటి స్పందిన లేదని అన్నారు.

ఇప్పుడే మా దృష్టికి వచ్చింది: లయోలా స్కూల్ యాజమాన్యం

చిన్నపిల్లని కొట్టడం చాలా తప్పు గతంలో మేము టీచర్లకు అందరికీ చిన్న పిల్లల్ని కొట్టొద్దని టీచర్ పేరెంట్స్ మీటింగ్ లో కూడా చెప్పాము. ఆయన గాని కొడుతున్నారు రేపు రండి మాట్లాడుకుందాం అని చెప్పి విద్యార్థిని మేనమామకు చెప్పడం జరిగింది. మళ్లీ ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటాం.

Next Story