- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు.

దిశ, హనుమకొండ : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వే ను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే అధికారులు ఇండ్ల వద్ద సేకరిస్తున్న వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ అర్హులైన వారి అన్ని వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా సర్వే అధికారులు నమోదు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వేను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- Tags
- Warangal






