ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని తొల‌గించాల్సిందే

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ టీడీపీ క‌రుమ‌రుగైన విష‌యం తెలిసిందే. మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో ఎన్టీఆర్ గ్రామాలు పెట్టే నైతిక‌త లేద‌ని ఆదివాసీ ప్ర‌జా సంఘాల జేఏసీ మండ‌ల అధ్య‌క్షుడు పోలెబోయిన ఆదినారాయ‌ణ పేర్కొన్నారు.

ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని తొల‌గించాల్సిందే
X

దిశ‌, మంగ‌పేట : తెలంగాణ టీడీపీ క‌రుమ‌రుగైన విష‌యం తెలిసిందే. మండ‌లంలోని ప‌లు గ్రామాల్లో ఎన్టీఆర్ గ్రామాలు పెట్టే నైతిక‌త లేద‌ని ఆదివాసీ ప్ర‌జా సంఘాల జేఏసీ మండ‌ల అధ్య‌క్షుడు పోలెబోయిన ఆదినారాయ‌ణ పేర్కొన్నారు. శుక్ర‌వారం మండ‌ల కేంద్రంలో వివాదస్పదమైన ఎన్టీఆర్ విగ్రహం వద్ద విలేకర్లతో మాట్లాడారు. మండలంలోని ఎస్టీ, నాన్ ఎస్టీల కేసు సుప్రీం కోర్టులో ఉండగా వలస గిరిజనేతరులు ఎస్టీల భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్టీఆర్ విగ్రహం పేరుతో స్థలం ఆక్రమించుకోవడం ఏంటని నిలదీశారు. 2014 నుంచి 2024 వరకు తెలంగాణలో ప్రజాక్షేత్రంలో లేకుండా పోయిన టీడీపీ ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన నాయకులు వాడగూడెం, మంగపేటలలో విగ్రహాలు ఏర్పాట్లు చేశారని తెలిపారు.

దానిని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. ప్రభుత్వ నిబంధ‌న‌ల మేరకు విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్, ఫౌరసరఫరా అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామపంచాయతీ, పెసా గ్రామసభల అనుమతులు లేవని సమాచార హక్కు చట్టం కింద సమాచారం తీసుకున్నట్లు ఆదినారాయణ తెలిపారు. ఆదివాసుల హక్కులు, చట్టాల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తమకు పదవులకన్నా ఆదివాసి అస్తిత్వం ముఖ్యమని హెచ్చరించారు. వెంట ఆదివాసీ ప్రజాసంఘాల జేఏసీ నాయకులు అన్నెబోయిన సమ్మయ్య, కొమరం రవికుమార్ లు పాల్గొన్నారు .

Next Story