- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమర్జెన్సీ సమయంలో 108 సిబ్బంది సేవలు అభినందనీయం
పాలకుర్తి ఎమ్మెల్యే అనుమండ్ల యశస్విని రెడ్డి బంధువు అనుమండ్ల తిరుపతి రెడ్డికి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

X
దిశ, బచ్చన్నపేట : పాలకుర్తి ఎమ్మెల్యే అనుమండ్ల యశస్విని రెడ్డి బంధువు అనుమండ్ల తిరుపతి రెడ్డికి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే బచ్చన్నపేట 108 అంబులెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించి అత్యవసర వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈఎంటి టీ. రాజు, పైలట్ సురేష్ జిల్లా మేనేజర్ రాము, ప్రోగ్రామ్ మేనేజర్ సలీం అనుమతితో రోగిని అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈఆర్ సీపీ అడ్వైజ్‌తో ఈఎంటి టీ. రాజు అందించిన వైద్య సహాయాన్ని ప్రశంసిస్తూ.. 108 సిబ్బంది సేవలు అభినందనీయమని ప్రత్యేకంగా తెలిపారు.
Next Story






