- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, పరకాల : పరకాల పట్టణంలో పోలీసులు గంజాయి తరలిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా అంబేద్కర్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి డబ్బా పక్కన దాక్కుండగా పరకాల ఎస్ఐ ఈ నరసింహారావు పట్టుకున్నారు. అతడి చేతిలోని కవర్ ను తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు నిర్ధారించారు. పోలీసులు విచారణ చేయగా పరకాల పట్టణానికి చెందిన మహమ్మద్ నదీమ్, వయస్సు 20 ఏండ్లుగా తెలిసింది. పదవ తరగతి వరకు చదువుకొని మటన్ షాప్ నడుపుకుంటూ జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అరకు వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల దగ్గర కేజీ గంజాయిని కొనుక్కొని యువతకు ఎక్కువ ధరకు అమ్మేవాడు. ఈ క్రమంలోనే గంజాయిని కవర్లో వేసుకొని వరంగల్ వైపు వెళ్తుండగా అంబేద్కర్ సెంటర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 220 గ్రాముల గంజాయి విలువ 5000 రూపాయలు కలదని పోలీసులు తెలిపారు.






