దేవాదుల పంపు హౌస్ ను పరిశీలించిన జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ , ధర్మసాగర్ లోని రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్ ను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావు శుక్రవారం సందర్శించారు.

దేవాదుల పంపు హౌస్ ను పరిశీలించిన జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్: హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్ , ధర్మసాగర్ లోని రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్ ను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్.కాంతారావు శుక్రవారం సందర్శించారు. దేవన్నపేట పంప్ హౌస్, ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ వివరాలను అధికారులు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కి వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్ అండ్ అర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ సింగ్, సీడ‌బ్ల్యూసీ డైరెక్టర్ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఇఎన్సీ జనరల్ రమేష్ బాబు, చీఫ్ ఇంజనీర్ సుధీర్, ఇరిగేషన్ ఎస్ ఈ రాం ప్రసాద్, ఈఈలు సీతారాం,మంగీలాల్, హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, జిల్లా సాగునీటిపారుదల శాఖ అధికారి రామ్మోహన్ పాల్గొన్నారు.

Next Story