- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 25న రెండవ విడత జనహిత పాదయాత్ర
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో టీపీసీసీ చేపట్టిన రెండవ విడత జనహిత పాదయాత్ర మొదలుకానుంది. ఈనెల 25న వర్దన్నపేట

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో టీపీసీసీ చేపట్టిన రెండవ విడత జనహిత పాదయాత్ర మొదలుకానుంది. ఈనెల 25న వర్దన్నపేట నియోజకర్గం పరిధిలో ఈ పాదయాత్ర జరుగనుంది. వర్దన్నపేట మండలంలోని ఇల్లంద నుంచి వర్దన్నపేట వరకు ఈపాదయాత్రను నిర్వహించనున్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షేలు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు హాజరుకానున్నారు. రెండవ విడత చేపట్టిన జనహిత పాదయాత్రలో ప్రభుత్వ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
ఈ జనహిత పాదయాత్ర కోసం హన్మకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సాంఘిక సంక్షేమల శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ అధ్యక్షత వహించగా మంత్రులు సీతక్క పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, నాగరాజు, యశాశ్విని రెడ్డి, మక్కన్ సింగ్ , ఎంపీ కావ్యతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈజనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి ముఖ్య కార్యకర్తలతో పాటు నేతలు హాజరుకావాలని కోరారు. ప్రభుత్వం పేదల కోసం ఎన్నోపథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందన్నారు.
వారికి మరింత దగ్గరయ్యే విధంగా ఉండేందుకే పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పాటు ఇంచార్జిలు బాధ్యతగా తీసుకొని కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా క్రుషి చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జితో పాటు మంత్రులు, ఇతర నేతలు పాల్గొనే అవకాశం ఉన్నందున అందరూ హాజరు కావాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కార్యక్రమాలను తీసుకుపోయేందుకే ఈ జనహిత పాదయాత్రను చేపడుతున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.






