- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేర పరిశోధనలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకం
నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజేన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న బీగల్ జాతికి చెందిన భైరవ్, విరాట్ జాగిలాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు పంపారు. నూతనంగా విధుల్లోకి చేరిన నూతన పోలీస్ జాగిలాలను వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఈ పోలీస్ జాగిలాల హ్యాండ్లర్లు కుమార స్వామి (భైరవ్ హ్యాండ్లర్), సాంబయ్య (విరాట్ హ్యాండ్లర్) లను జాగిలాల పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిక్షణ కాలంలో జాగిలాలకు నిర్వహించిన క్లిష్టతరమైన పరీక్షల్లో ఉత్తమంగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన భైరవ్ జాగిలానికి సీపీ మెడల్ అలంకరించి హ్యాంగ్లర్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసి గడితాయని అన్నారు. ఈ శునకాలు చూడటానికి చిన్న అకారంలో ఉన్న పెద్ద జాగిలాలు వెళ్ళలేని ప్రదేశాలు, మార్గాల్లో ఈ జాగిలాలు వెళ్ళి ప్రేలుడు పదార్థాలను గుర్తిస్తాయని అన్నారు. ముఖ్యంగా విమానాల్లో ప్రయాణికుల సామాను భద్రపరిచే క్యాబిన్లల్లో కార్ల క్రిందకు వెళ్లి ప్రేలుడు పదార్థాలను గుర్తించడం ఈ జాగిలాల ప్రత్యేకత అని తెలిపారు. ఈ పోలీస్ జాగిలాల ద్వారా గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నో కేసుల్లో నిందితులను గుర్తించడంతో పాటు మత్తు పదార్థాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు శ్రీనివాస్, రవి, ఏసీపీ సురేంద్ర, ఆపరేషన్స్ ఆర్.ఐ సింహచలం శ్రీనివాస్, డాగ్ స్వ్కాడ్ ఇన్ చార్జి ప్రభాకర్ పాల్గొన్నారు.






