గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే

by Bhanu |

స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటే విధంగా ఈటల స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.

గ్రామాల అభివృద్ధి బాధ్యత నాదే
X

దిశ, కమలాపూర్: స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటే విధంగా ఈటల స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఈటల నివాసంలో బిజెపి పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులకు తగిన సూచనలు చేస్తూ పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో అభ్యర్థులకు నచ్చ చెప్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ మండల కేంద్రమైన కమలాపూర్ గ్రామం నుండి బిజెపి తరఫున పంబ్బు సతీష్ గౌడ్ ను ఈటెల బలపరిచారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, గ్రామాలను అభివృద్ధి జరిపించే బాధ్యత తనదని, స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఉదయం నుండి వివిధ గ్రామాల నుండి ఈటల నివాసంలో స్థానిక ఎన్నికలపై మంతనాలు జరుగుతున్నాయి.

Next Story