Medico Preethi ప్రీతి ఆత్మహత్యయత్నానికి ముందు తల్లితో మాట్లాడిన ఫోన్​ ఆడియా వైరల్​

by Sridhar Babu |   (  Updated:2023-05-19 07:16:45  IST  )

ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు డాక్టర్ ప్రీతి తల్లితో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం వైరల్​గా మారింది.

Medico Preethi ప్రీతి  ఆత్మహత్యయత్నానికి ముందు తల్లితో మాట్లాడిన ఫోన్​ ఆడియా వైరల్​
X

దిశ, కరీమాబాద్ : ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు డాక్టర్ ప్రీతి తల్లితో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం వైరల్​గా మారింది. హెచ్ఓడీ తనను పిలిపించి మాట్లాడారని, ఏమైనా జరిగితే హెచ్ఓడీ దగ్గరకు రావాలి కానీ ప్రిన్సిపాల్ దగ్గరికి ఎందుకు వెళ్లావని ప్రశ్నించాడని ప్రీతి తల్లితో చెప్పింది. సైఫ్ ను కూడా పిలిచి మాట్లాడారని, కానీ ఏమి మాట్లాడారో తనకి తెలియదని పేర్కొంది.

తనకు చాలా భయంగా ఉందని తల్లితో చెప్పగా అందుకు బదులుగా తల్లి ఎందుకు భయపడుతున్నావు... ఏం కాదని, వరంగల్ లో అందరూ మనవాళ్లే ఉన్నారని సర్దిచెప్పారు. తనని ఏమి చేస్తారో అని, సెకండ్ ఇయర్ వాళ్లంతా ఒకటే కదా అని ప్రీతి అనగా వాళ్లు కూడా వీడితో కలిసి అలాగే చేస్తారా అని తల్లి అడిగారు. వాళ్లు ఏమీ అలా చేయారు కానీ.... అంటూ తాను డ్యూటీలో ఉన్నానని, మళ్లీ చేస్తా అని ప్రీతి ఫోన్ కట్ చేయబోయారు. దాంతో ఆమె తల్లి నిందితుడు సైఫ్ నంబర్ అడగగా ఏమీ వద్దు అని ప్రీతి ఫోన్ కట్ చేసినట్లు ఈ ఆడియోలో క్లియర్ గా అర్థం అవుతుంది.

Next Story