గీత కార్మికుడిని హ‌త్య చేసిన వ్యక్తి అరెస్ట్

by Ratna Kumari |

గీత కార్మికుడిని హ‌త్య చేసిన వ్య‌క్తి అరెస్టైన ఘట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ పులి ర‌మేష్ ఆదివారం విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

గీత కార్మికుడిని హ‌త్య చేసిన వ్యక్తి అరెస్ట్
X

దిశ‌, ఎల్క‌తుర్తి : గీత కార్మికుడిని హ‌త్య చేసిన వ్య‌క్తి అరెస్టైన ఘట‌న మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ పులి ర‌మేష్ ఆదివారం విలేక‌ర్ల స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈనెల 14న ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద ఉన్న క‌ల్లు మండ‌వ వ‌ద్ద జ‌రిగిన హ‌త్య ఘ‌ట‌న పై అత‌ని భార్య శ్వేత ఇచ్చిన ఫిర్యాదుతో అక్కెప‌ల్లి అఖిల్ పై కేసున‌మోదు చేసిన‌ట్టు తెలిపారు. క‌మ‌లాపూర్ మండ‌లం కొత్త‌ప‌ల్లి గ్రామానికి చెందిన అక్కెప‌ల్లి అఖిల్(32) ని ఎల్క‌తుర్తిలోని స‌త్య‌సాయి గార్డెన్ వ‌ద్ద అదుపులోకి తీసుకున్నారు. దీంతో అత‌న్ని విచారించ‌గా మృతుడు గోడిశాల విజ‌య్ కుమార్ త‌న భార్య‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్నాడ‌నే అనుమానంతో అత‌న్ని ఎలాగైనా చంపాల‌ని ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలిపారు.


అత‌ను వేసిన ప్లాన్ ప్ర‌కారం.. ఈనెల 14న త‌న భార్య‌, పిల్ల‌ల‌ను త‌న త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు పంపించాడు. కొబ్బ‌రి బోండాలు న‌రికే క‌త్తిని కాశీబుగ్గ‌లో కొనుగోలు చేసి.. త‌న ప‌ల్స‌ర్ బైకు ట్యాంక్ క‌వ‌ర్ లో పెట్టుకొని ఎల్ల‌మ్మ గుడి వ‌ద్ద ఉన్న క‌ల్లు మండ‌వ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అక్క‌డ విజ‌య్ కుమార్ వ‌ద్ద‌నే క‌ల్లు తాగి.. అత‌నితో మంచిగా ఉన్న‌ట్టు న‌టించాడు. విజ‌య్ కుమార్ ఆద‌మ‌రిచి ఉండ‌గా.. అదే అదునుగా భావించిన అఖిల్ త‌న బైకు ట్యాంక్ క‌వ‌ర్ లో నుంచి తాను తెచ్చుకున్న‌న క‌త్తి తీసుకొని విజ‌య్ కుమార్ త‌ల‌, కుడిచేయి, వీపు, చాతి పై న‌రికి చంపాడు. అక్క‌డి నుంచి త‌న బైకుతో పరారైన‌ట్టు ఒప్పుకున్నాడు. అత‌ని వ‌ద్ద ఉన్న బైక్, మొబైల్ ను సీజ్ చేసి.. అత‌న్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజ‌రుప‌రిచారు. సీఐ వెంట ఎస్ఐ నరసింహారావు, ఏ ఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది, సుమన్, రాజు ఉన్నారు.

Next Story