- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.100 కోసం హత్య చేసిన వ్యక్తి రిమాండ్..
by Taduka Kalyani |
రూ.100 కోసం ఓ వ్యక్తిని కొట్టి హత్య చేసిన నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

X
దిశ, పెద్దవంగర: రూ.100 కోసం ఓ వ్యక్తిని కొట్టి హత్య చేసిన నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. మండల పరిధిలోని గట్లకుంట గ్రామానికి చెందిన దుర్సోజు మురళి అదే గ్రామానికి చెందిన ముత్తినేని రాములు వద్దకు కూలీ పనికి వెళ్లాడు. మురళి కూలీ డబ్బులు అడగగా రాములు తాగిన మైకంలో కొట్టడంతో తీవ్రగాయాలై చనిపోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. మురళి డబ్బులు అడగడంతోనే కోపంతో కొట్టినట్లు నిర్ధారించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్ కు తరలించామని సీఐ తెలిపారు.
Next Story






