- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్ టవర్ ఎక్కి చనిపోతానని వ్యక్తి హల్ చల్
జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి తాను చనిపోతానంటూ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన మండలం కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

దిశ, రఘునాథపల్లి : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి తాను చనిపోతానంటూ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన మండలం కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కార్ఖానగడ్డ కేంద్రానికి చెందిన సుల్తాన్ జుబేర్(37) గత కొంతకాలంగా కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తన తండ్రి, సోదరులు గత కొంతకాలంగా ఇంట్లోకి రానీయకుండా వేధిస్తున్నారని.. జీవితం పై విరక్తి చెంది మండల కేంద్రంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి ఎస్సై దూధిమెట్ల నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని రెండు గంటలకు పైగా అతనితో మాట్లాడి తప్పకుండా తన కుటుంబ సభ్యులతో మాట్లాడి నీకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చాడు. అతన్ని ఒప్పించి టవర్ దిగేలా చేశారు. అనంతరం అతన్ని తీసుకెళ్లి భోజన సదుపాయం కల్పించి స్థానిక పోలీస్ స్టేషన్ లో బస ఏర్పాటు చేశారు దీంతో కథ సుఖాంతం కావడంతో చుట్టుపక్క ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. చాకచక్యంగా యువకుడ్ని రక్షించిన పోలీసులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.






