ప్రభుత్వానికి చెందాల్సినటువంటి డబ్బును కాజేస్తున్న ఎంపీడీవో..

by Kodari Anjali |

కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయం లో రోజుకు ఒక అవినీతి బయటపడుతుంది.

ప్రభుత్వానికి చెందాల్సినటువంటి డబ్బును కాజేస్తున్న ఎంపీడీవో..
X

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో రోజుకు ఒక అవినీతి బయటపడుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రికవరీ సుమారు 13 లక్షల రూపాయలను కాజే యడానికి ప్రయత్నిస్తున్న ఎంపీడీవో 15 ఫైనాన్స్లో వర్కులు చేసిన కాంట్రాక్టర్లకు ఎం.బి పరంగా వివిధ రకాల ప్రభుత్వానికి చెల్లించవలసిన కటింగ్ చేశారు. అందులో జీఎస్టీ, ఐటీ , క్యూసి, ఇ.ఎం.డీ ఫర్ క్యాప్ట, సీనియర్ ఏజ్ కటింగ్ చేసి మిగతా అమౌంట్‌ని కాంట్రాక్టర్‌కి చెల్లించారు. దీంట్లో ఇ.ఎం.డీ కాంట్రాక్టర్‌కి ఇవ్వవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఒక పని పూర్తి అవుతుందో ఎం.బి చేసిన తర్వాత ఆ రికవరీ అమౌంట్‌ని వివిధ శాఖలకు పంపించవలసి ఉంటుంది. కానీ అలా చేయకుండా ఎంపీడీవో తమ దగ్గరే ఉంచుకొని తన సొంతానికి వాడుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మేము ఇప్పటికే అప్పు తీసుకొచ్చి పెట్టాము ఇ.ఎం.డీ వస్తే మా పెట్రోల్ ఖర్చులైనా వెళ్తాయి కదా అని చెబుతున్నారు.

ఆదర్శ పాఠశాలకు సంబంధించి...

ఇది ఇలా ఉంటే 2024 సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద కేసముద్రం మండలానికి ఫస్ట్ దఫా సుమారుగా 62 లక్షలు మరో దఫా 32 లక్షలు జిల్లా కలెక్టర్ గారి నుండి మంజూరైనట్లు తెలుస్తుంది. అప్పట్లో కాంట్రాక్టర్లు అనేక స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద వర్కులు చేసి ఎం.బి లు చేయించుకొని జీఎస్టీ, ఐటి, వివిధ రకాల కటింగ్ చేసిన తర్వాత మిగతా అమౌంట్ ని కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. లక్ష రూపాయల వర్క్ చేసినట్లయితే కటింగ్ తరువాత వారికి 70,000 నుంచి 80000 చేతికి వచ్చాయని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించి రికవరీ అమౌంట్ అంతా కూడా డ్రాయింగ్ ఆఫీసర్ ఖాతాలో సుమారుగా 13 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఇట్టి అమౌంటు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది అడిగేది ఎవరూ లేరు అన్నట్టుగా ఎంపీడీవో ఆ 13 లక్షల నుండి తనకి ఇష్టం వచ్చినట్లు డబ్బులు డ్రా చేసుకుంటుంది. ఇదంతా ప్రభుత్వానికి మరియు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన సొమ్ము.

అక్విడెన్సులు అన్నీ కూడా ఎంపీడీవో గారి దగ్గరే

కాంట్రాక్టర్లకు ఇన్ టైంలో జిఎస్టి, ఐటీ కట్టకపోతే వారి యొక్క కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. దీనిపై ఎంపీడీవో గారిని వివరణ కోరగా డి డి ఓ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంటును సబ్జెక్ట్ రియంబర్మెంట్ కింద పై అధికారులకు తెలిసే తీసుకున్నానని చెబుతున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే సెక్షన్ ఆఫీసర్ దగ్గరే ఉండాల్సినటువంటి చెక్ బుక్, క్యాష్ బుక్స్, అక్విడెన్సులు అన్నీ కూడా ఎంపీడీవో దగ్గరే ఉన్నట్లు సమాచారం. రీసెంట్‌గా వార్డు మెంబర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అట్ ట్రైనింగ్ ఇచ్చినందుకుగాను సుమారుగా నాలుగు లక్షల రూపాయలు రావడం జరిగింది. అట్టి అమౌంట్‌ని టీఓటిలకు చెల్లించవలసి ఉంటుంది కానీ ఆ అమౌంట్ ని కూడా విడిపించుకోవడం జరిగింది. టిఓటిలకు ఇవ్వలేదు. గత వారం రోజుల క్రితం ఎన్నికల్లో పనిచేసిన మినిస్టర్ స్టాప్‌కు డి డి ఓ ఎకౌంట్లో డబ్బులు పడడం జరిగింది. అట్టి అమౌంటు కూడా వారికి చెల్లించకుండా తన సొంతానికి వాడుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీనిపై జెడ్పీ సీఈవో వివరణ కోరగా...

మండల ప్రత్యేక అధికారి వివరణ కోరగా గతంలో ఎంపీపీ లు ఉన్నప్పుడు వారి యొక్క నోట్ ఫైల్ ద్వారా ఆఫీస్ ఎక్స్పెండిచర్ గాని, ఇతర బిల్లులు గాని, వర్క్ బిల్లులకు సంబంధించి డ్రాయింగ్ ఆఫీసర్ చెక్కులు ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రత్యేక అధికార పాలన సమయంలో కూడా నోట్ ఫైల్ ఆమోదం తర్వాతే చెక్కులు ఇష్యూ చేయాలి. అలాంటివేవీ నేను చేయలేదని చెబుతున్నారు, సబ్జెక్ట్ రియంబర్మెంటు కింద తీసుకోవాలంటే కంపల్సరిగా నోట్ ఫైల్ ఆమోదం పొందాలి. అట్టి విషయo కలెక్టర్ దృష్టిలో కూడా ఉండాలి కానీ అవేవీ తనకు తెలియవని వారు చెబుతున్నారు. దీనిపై జెడ్పీ సీఈవో వివరణ కోరగా తప్పు చేస్తే ఎంతటి అధికారుల కైనా శిక్ష తప్పదు. ప్రభుత్వానికి చెందాల్సినటువంటిది రికవరీ అమౌంటు ఇన్ టైం లో చెల్లించకపోతే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని, త్వరలోనే కేసముద్రం మండలం పైన ఏజీ ఆడిట్ వారికి సిఫార్సు చేస్తానని చెబుతున్నారు. ఇప్పటికైనా అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఎంపీడీవో పై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి. కొంతమంది రాజకీయ నాయకులు ఎంపీడీవో వెనుక ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ ఎలాంటి చర్యలకు పాల్పడట్లేదని మండలంలో గుసగుసలు అని కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

Next Story