- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పొలం, డబ్బు ఆశ చూపి కిడ్నీ తీసుకున్న ఘటనపై మంత్రి ఆగ్రహం
మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు పోలేపల్లి తండాకు చెందిన గిరిజన రైతు, ధరావత్ చిట్టిబాబుకు ‘‘పొలం, డబ్బు, ఆశ చూపి కిడ్నీ తీసుకున్నరు" అని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా కథనంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణం స్పందించారు.

దిశ, వెబ్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు పోలేపల్లి తండాకు చెందిన గిరిజన రైతు, ధరావత్ చిట్టిబాబుకు ‘‘పొలం, డబ్బు, ఆశ చూపి కిడ్నీ తీసుకున్నరు" అని ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తా కథనంపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణం స్పందించారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకుడైన గిరిజనుడిని మభ్య పెట్టి ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని వదిలిపెట్టొద్దన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తో టెలిఫోన్ లో మాట్లాడి తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను, వైద్య శాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పడు తనిఖీలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.






