జాబ్ మేళా ప్రచారం ఫుల్.. కానీ ఏర్పాట్లు మాత్రం నిల్

by Naveena |

వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా నిర్వహించారు.

జాబ్ మేళా ప్రచారం ఫుల్.. కానీ ఏర్పాట్లు మాత్రం నిల్
X

దిశ, వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ లో జాబ్ మేళా నిర్వహించారు. అయితే జాబ్ మేళా ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత కొద్ది రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్లో ఈ జాబ్ మేళా 50 కంపెనీలు, 2000 ఉద్యోగాలతో నిర్వహిస్తున్నట్టు ఫుల్ ప్రచారం చేశారు. కానీ ఏర్పాట్లు చేయడం మాత్రం మరిచారు.

జాబ్ మేళాలో పాల్గొనేందుకు నిరుద్యోగులు ఫంక్షన్ హాల్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కానీ అక్కడ ఏర్పాట్లు అంతంత మాత్రమే ఉండటంతో ..ఫంక్షన్ హాల్ వద్ద తొక్కిసులాట ఏర్పడింది. ఈ క్రమంలో ప్రధాన ద్వారం వద్ద గల అద్దం ధ్వంసమై ముగ్గురు నిరుద్యోగ యువతులకు గాయాలయ్యాయి. గాయపడిన నిరుద్యోగ యువతులను సమీప ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి.. చికిత్స అందించి పోలీసులు జాబ్ మేళాలో ఇంటర్వ్యూ ఇప్పించారు. ఎండ తీవ్రతతో డిహైడ్రేట్ అయ్యి నిరుద్యోగులు తల్లడిల్లిపోయారు . 50 కంపెనీలు, 2 వేల ఉద్యోగాలతో జాబ్ వేళా నిర్వహిస్తున్నామని దానికి క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకోవాలని అధికారులు తెలుపగా.. అందుకు 10 వేల 300 మంది నిరుద్యోగులు ఆ క్యూఆర్ కోడ్ తో వారి పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. 10300 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, తెలిసినా కూడా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు. నిరుద్యోగులపై ఎందుకు ఇంత చిన్నచూపు అని జాబ్ మేళాలో పాల్గొనేందుకు వచ్చిన నిరుద్యోగ యువత, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story