ఆటోలో నార్మల్ డెలివరీ.. Staff Nurse సమయస్ఫూర్తితో తల్లీ బిడ్డ క్షేమం

by Vinod kumar |   (  Updated:2022-12-13 10:56:31  IST  )

ఆటోలోనే నార్మల్ డెలివరీ అయిన ఘటన గంగారం మండలం లో చోటుచేసుకుంది.

ఆటోలో నార్మల్ డెలివరీ.. Staff Nurse సమయస్ఫూర్తితో తల్లీ బిడ్డ క్షేమం
X

దిశ, గంగారం: ఆటోలోనే నార్మల్ డెలివరీ అయిన ఘటన గంగారం మండలం లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంగారం మండలంలోని పోనుగొండ్ల గ్రామానికి చెందిన ఈసం కావేరి (23)కి నొప్పులు రావడంతో గంగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో స్టాఫ్ నర్స్ యాక లక్ష్మి సమయస్ఫూర్తిగా వ్యవహరించి అక్కడే సాధారణ డెలివరీ చేసింది. ఏఎన్ ఎం వెంకట లక్ష్మి తో కలిసి అక్కడే సాధారణ డెలివరీ చేసింది. కావేరికి కొడుకు పుట్టినట్లు, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు హాస్పిటల్ సిబ్బంది, ఆశ చంద్రకళ, అటెండర్ జయేందర్ ఉన్నారు.

Next Story