- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2వ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం..!
గోదావరి నది తుపాకులగూడెం సమ్మక్క సాగర్ వద్ద 84.20 అడుగులతో రెండు ప్రమాద హెచ్చరికను దాటిప్రవహిస్తున్నది.

దిశ, మంగపేట : గోదావరి నది తుపాకులగూడెం సమ్మక్క సాగర్ వద్ద 84.20 అడుగులతో రెండు ప్రమాద హెచ్చరికను దాటిప్రవహిస్తున్నది. రామన్నగూడెం వద్ద 74. 33 అడుగులతో 15.82 మీటర్లతో 10 లక్షల 43 వేల 280 క్యూసెక్కుల భారీ ప్రవాహం ఉండడంతో అధికారులు మద్యాహ్నం 2 గంటలకు 2వ, ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో గోదావరి ముంపు ప్రాంతాలలోని ప్రజలను రెవిన్యూ. పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు అప్రమత్తం చేశారు. మంగపేట వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో బ్యాక్ వాటర్ పోటు గౌరారంవాగు కొత్త బ్రిడ్జీ వరకు చేరింది.
2వ, ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో అధికారులు మండల కేంద్రంలోని వాగులోతట్టు ప్రాంతాలైన పొద్మూరు, ముస్లీంవాడ, వడ్డెర కాలనీ ప్రజలను అప్రమత్తం చేసి ఏఓణంలోనై పునరావాస కేంద్రాలకు తరలేందుకు సిధ్దంగా ఉండాలని ఆదేశించారు.మండలంలోని అకినేపల్లి మల్లారం, కమలాపురం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించినట్లు తెలిపారు. మండల కేంద్రంలో డీటీ మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి సురేష్, అకినేపల్లి మల్లారంలో తహసీల్దార్ తోట రవీందర్, ఎస్సై తిరునగరి వెంకటరంగ సూరి, ఎంపీడీవో భద్రులు మకాం వేసి పరిస్థితులను జిల్లా కలెక్టర్, మంత్రి సీతక్కకు వివరిస్తున్నట్లు తెలిపారు.






