Medaram Jatara 2026 : మేడారంలో చివరి ఘట్టం మొదలు

by Taduka Kalyani |

మేడారంలో చివరి ఘట్టం మొదలైంది. అదివాసులతో పాటు లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్న సమ్మక్కను గిరిజన సాంప్రదాయం మధ్య తీసుకువచ్చేందుకు చిలుకలగుట్టకు కోయ పూజారులు చేరుకున్నారు.

Medaram Jatara 2026 : మేడారంలో చివరి ఘట్టం మొదలు
X

దిశ మేడారం న్యూస్ నెట్వర్క్ : మేడారంలో చివరి ఘట్టం మొదలైంది. అదివాసులతో పాటు లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్న సమ్మక్కను గిరిజన సాంప్రదాయం మధ్య తీసుకువచ్చేందుకు చిలుకలగుట్టకు కోయ పూజారులు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య చిలుకలగుట్టలో కోయ పూజారులు రహస్య పూజలను నిర్వహించారు. భక్తి శ్రద్దలతో పూజలు చేసి అమ్మవారిని ఆవహింపు చేసుకొని వనం నుంచి గద్దెకు తీసుకువస్తున్నారు. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమబరినిలో తీసుకువచ్చేందుకు పూజారులు రాగా వేలాది మంది భక్తులు చిలుకలగుట్ట వరకు తరలివచ్చారు. భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. గిరిజన పూజారులతో పాటు జిల్లా కలెక్టర్ డ్, ఎస్పీ చిలుకలగుట్టకు చేరుకున్నారు. పూజారులు సాంప్రదాయ పూజలు చేయగానే చిలుకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకువస్తున్నారు. ఆదివాసిల సాంప్రదాయం ప్రకారం డోలు, కొమ్ము వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఆనవాయితీగా వస్తున్న అమ్మవారికి జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ గాలిలో కాల్పులు జరిపి స్వాగతం పలికారు. వేలాదిగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేసుకుంటూ అమ్మవారిని తరలిస్తున్నారు. ఓవైపు శివసత్తులు పూనకాలతో స్వాగతం తెలుపుతుండగా గిరిజన పూజారులను చూసి తరించేందుకు వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారిని గద్దెలకు వచ్చే ముందు కన్నులారా దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర కోసం భారీ ఏర్పాట్లు చేసిన పోలీసులు చివరి ఘట్టాన్ని ఎలాంటి ఒడదుడుకులు లేకుండా నిర్వహించేందుకు రోప్ పార్టీ ఆధ్వర్యంలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్దలతో పూజారులు, ఆదివాసీల నృత్యాలతో స్వాగతం పలుకుతూ అమ్మవారిని వనంలోనుంచి జనం మధ్యలో ఉన్న గద్దెలకు తీసుకువస్తున్నారు. దారి పొడవునా కోళ్లు, మేకలను కొస్తూ భక్తులు స్వాగతం పలుకుతున్నారు. సమ్మక్క ను చూసేందుకు భక్తులు పోటీపడుతున్నారు.

Next Story