- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాండ్ బజార్ ఏర్పాటుతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రయోజనం
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ రేట్ లో సాండ్ బజార్ లో ఇసుక లభించడం

దిశ, వరంగల్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో సాండ్ బజార్ ను ఏర్పాటు చేసిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, టిజిఎండిసి అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సాండ్ బజార్ లో నాణ్యమైన ఇసుక ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాండ్ బజార్ లో అందుబాటులో ఉన్న నాణ్యమైన ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీజీఎండిసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాండ్ బజార్ లో వినియోగదారులకు సరిపడే విధంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఇసుక కోసం వచ్చే లబ్ధిదారులకు సిబ్బంది ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు.
సాండ్ బజార్ లో లభించే ఇసుకను తీసుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్లో బుక్ చేసుకోవడం రాని వారికి సిబ్బందినే ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసి అందించాలన్నారు. గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నందున ఆయా గ్రామాలలో ఇసుక అవసరాలను గుర్తించి ఆయా గ్రామాల వద్దకే ఇసుకను తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 80% ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ అయిందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఇది అత్యధికమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు తక్కువ ధరలో లబ్ధిదారులకు ఇసుక అందించడమే లక్ష్యంగా సాండ్ బజార్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ రేట్ లో సాండ్ బజార్ లో ఇసుక లభించడం చాలా సంతోషంగా ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. నాణ్యమైన ఇసుకను అందించే సాండ్ బజార్ ఏర్పాటుతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఉనికిచర్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాండ్ బజార్లో నాణ్యమైన ఇసుక తక్కువ ధరలో అందుబాటులో ఉంటుందని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీజీఎండిసి పోర్టల్ ద్వారా, లేదా మీసేవ కేంద్రాల ద్వారా, ఆన్లైన్లో ఇసుకను బుకింగ్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎండిసి నోడల్ అధికారి శ్రీనివాస్, పిడి హౌసింగ్ సిద్ధార్థ నాయక్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి ప్రాజెక్ట్ అధికారులు విష్ణువర్ధన్, వినయ్, రాజు, స్థానిక తహసిల్దార్ సదానందం, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.






