గిరిజన మహిళల ఆదాయ వృద్ధికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది

by Taduka Kalyani |

జిల్లాలోని గిరిజన మహిళల ఉపాధి, ఆదాయ వృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.

గిరిజన మహిళల ఆదాయ వృద్ధికి జిల్లా యంత్రాంగం అండగా ఉంటుంది
X

దిశ,ములుగు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని గిరిజన మహిళల ఉపాధి, ఆదాయ వృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో ములుగు మండలం పొట్లాపూర్ గ్రామానికి చెందిన సీత స్వయం సహాయక సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఇప్పపువ్వు లడ్డు స్టాల్‌ను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలు సంప్రదాయ ఆహార ఉత్పత్తులను ఆధునిక మార్కెట్‌తో అనుసంధానం చేసుకుంటూ స్వయం ఉపాధి సాధించడం అభినందనీయమని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, పరిశుభ్రతతో, రుచికరంగా ఇప్పపువ్వు లడ్డును తయారు చేయాలని మహిళా సంఘ సభ్యులకు సూచించారు. కలెక్టర్ వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story