భార్య చాటు భర్తగా వెంకటేష్.. ఆకట్టుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ వీడియో

by Chukka Sudharani |

విక్టరీ వెంకటేష్ తన 77వ ప్రాజెక్టు అయిన ‘ఆదర్శ కుటుంబం’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరోసారి కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

భార్య చాటు భర్తగా వెంకటేష్.. ఆకట్టుకుంటున్న ‘ఆదర్శ కుటుంబం’ వీడియో
X

దిశ‌, సినిమా: విక్టరీ వెంకటేష్ తన 77వ ప్రాజెక్టు అయిన ‘ఆదర్శ కుటుంబం’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరోసారి కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఇందులో వెంకీ పాత్రను చిట్టిబాబుగా పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ‘కిచెన్‌లో ఏసీ ఉంది నువ్వు హ్యాపీగా పని చేసుకోవచ్చు.. వాషింగ్ మిషన్ కూడా ఉంది నీకు పని తగ్గిపోయింది’ అంటూ శ్రీనిధి డైలాగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ వీడియోలో ‘యస్ నేనే ఇంటి యజమాని’ అంటూ వెంకీ భార్య (శ్రీనిధి శెట్టి) చాటు భర్తగా కనిపించారు. ఇదంతా చూసిన నారా రోహిత్ ‘ఆదర్శ కుటుంబం’ అనడంతో వీడియో ఎండ్ అవుతుంది. మొత్తంగా ఈ స్పెషల్ వీడియోతో సినిమాలో ఏ రేంజ్ ఫన్ ఉండబోతున్నదో చూపించేసి ఫ్యామిలీ ఆడియన్స్‌లో అంచనాలు పెంచేశాడు దర్శకుడు త్రివిక్రమ్. కాగా.. ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నారా రోహిత్ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story