- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జర్నలిస్టుల జట్టుకు మంత్రి పొంగులేటి అభినందనలు
తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు మంత్రి పొంగులేటి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

దిశ, ఖమ్మం : ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్‌ఎంటీవీ ప్రతినిధి మానుకొండ రవికిరణ్ ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు. మన ఖమ్మం జిల్లాకు చెందిన విలేకరి సారథ్యంలో తెలంగాణ జట్టు అంతర్రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలవడం గర్వకారణమని కొనియాడారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.






