- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
దుబాయ్ నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానం రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దేశంలో సర్వీసులో ఉన్న పలు విమానాల్లో సాంకేతిక లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా ఇవాళ మధ్యాహ్నం 194 మంది ప్రయాణికులతో దుబాయ్ (Dubai) నుంచి ముంబై (Mumbai)కి వస్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా పొగలు రావడం కలకలం రేపింది. దీంతో విమానాన్ని గుజరాత్‌లోని రాజ్‌కోట్ (Rajkot) విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే, విమానం గాల్లో ఉండగా ప్రయాణికుల లగేజీ స్టోర్ చేసే డెస్క్ నుంచి పొగలు వస్తున్నట్లుగా పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు రాజ్‌కోట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఈ ఘటనపై రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ దిగంత బోరా మాట్లాడుతూ.. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అన్నారు. ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని తెలిపారు. కార్గో విభాగంలో పొగలు రావడానికి గల కారణాలపై ఇండిగో సాంకేతిక బృందం సమగ్ర తనిఖీలు చేపడుతోందని పేర్కొన్నారు.






