Medaram Jatara 2026 : మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి లక్ష్మీదేవర నృత్యం

by Taduka Kalyani |

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో చిన్నారి లక్ష్మీదేవర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవార్ల గద్దెల సమీపంలో చిన్నారి ప్రదర్శించిన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Medaram Jatara 2026 : మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చిన్నారి లక్ష్మీదేవర నృత్యం
X

దిశ, మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరలో చిన్నారి లక్ష్మీదేవర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవార్ల గద్దెల సమీపంలో చిన్నారి ప్రదర్శించిన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంప్రదాయ వేషధారణలో, భక్తి భావంతో చేసిన నృత్యం చూసి అక్కడున్న భక్తులు తన్మయంలో ఊగిపోయారు. అమ్మవార్లను స్మరిస్తూ అడుగులేసిన ప్రతి క్షణం భక్తి రసాన్ని నింపడంతో పాటు, చిన్నారి నృత్యానికి భక్తులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. జాతర వాతావరణంలో ఈ నృత్యం ఆధ్యాత్మిక శోభను మరింత పెంచిందని పలువురు భక్తులు పేర్కొన్నారు. చిన్న వయసులోనే భక్తి, కళను మేళవిస్తూ లక్ష్మీదేవి ప్రదర్శించిన నృత్యం మేడారం జాతరలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిందని భక్తులు ప్రశంసలు కురిపించారు.

Next Story