- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో సీరియస్ అయిన కలెక్టర్.. మీ ఉద్యోగాలు ఉంటాయో,ఊడతాయో అని హెచ్చరిక!
విద్యార్థినిలకు అందించాల్సిన ఆహారానికి వాడే సరుకుల్లో కుళ్లిన కూరగాయలు, అల్లం పేస్ట్ నిలువలపై కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పై వరంగల్ జిల్లా కలెక్టర్ డా,సత్య శారదా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, దుగ్గొండి: విద్యార్థినిలకు అందించాల్సిన ఆహారానికి వాడే సరుకుల్లో కుళ్లిన కూరగాయలు, అల్లం పేస్ట్ నిలువలపై కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల స్పెషల్ ఆఫీసర్ పై వరంగల్ జిల్లా కలెక్టర్ డా,సత్య శారదా దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లిలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిషోర బాలికల ఎదుగుదల కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం పాఠశాల డైనింగ్ హల్లో నిల్వ చేసిన కూరగాయల్లో కుళ్లిన కూరగాయలను కలెక్టర్ గుర్తించారు. రేడిమేడ్ గా కొనుగోలు చేసిన అల్లం బాక్స్ వాసనతో ఉండటం, ఎప్పటికప్పుడు అల్లం తయారు చేసుకోవాలి గాని రేడిమేడ్ గా కొనుగోలు చేయకూడదన్నారు.
గ్రౌండ్ పరిసరాల్లో శుభ్రత పాటించకపోవడంతో సిబ్బందితో బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రతిదీ నోట్ చేసుకున్నామని కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ పాఠశాల ఎస్ ఓ మంజులను పిలిచి మెనూ ప్రకారం పప్పు మునగాకు కూరలో మునగాకు ఎదని ప్రశ్నించగా ఎస్ ఓ దగ్గర సమాధానం లేకపోవడం గమనార్హం. మునగాకు ఎవరికి కనబడిన చూపించాలని విద్యార్థినులను కలెక్టర్ అడిగారు.
విద్యార్థినులకు అందించే ఆహారంలో కారం, పులుపు ఎక్కువగా వాడుతున్నారని దీనివల్ల ఎదిగే పిల్లల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూరల్లో పులుపు, కారం తగ్గించాలని చెప్పారు. పాఠశాల ఆవరణ ఫిర్యాదుల పెట్టెను తెరిపించగా విద్యార్థులు చేసిన కంప్లైంట్స్ లో పాఠశాల ప్రిన్సిపాల్ ను మార్చాలని, వంటలు సరిగా ఉండటం లేదని హెడ్ కూక్ ను కూడా మార్చాలని ఫిర్యాదుల్లో ఉన్నాయి. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంపారు. దీంతోపాటుగా విద్యార్థులను ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ కు ఒక విద్యార్థిని బెంచీలు పూర్తిస్థాయిలో లేవని దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నామని బెంచ్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను కోరారు.
కలెక్టర్ ఎస్ ఓ తో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్లో పనితీరుపై తాను ప్రత్యేకంగా చొరవ తీసుకొని పాఠశాలల్లో నిర్వహించే, అందించే భోజనం, విద్యా విధానం పైన గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో సరైన క్రమంలో అనుకున్న రీతిగా గ్రేడింగ్ పాయింట్స్ రాకుంటే మీ ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో ఎస్ ఓ ను కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ తో పాటుగా జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీవో లెక్కల అరుంధతి, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఆర్ ఐ రాంబాబు తదితరులు ఉన్నారు.






