- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాప ప్రాణం తీసిన సీలింగ్ ఫ్యాన్..!
by Taduka Kalyani |
సీలింగ్ ఫ్యాన్ కారణంగా ఓ చిన్నారి ప్రాణం కోల్పోయిన సంఘటన పెద్దవంగర మండల పరిధి రామచంద్రుతండాలో మంగళవారం జరిగింది.

X
దిశ, పెద్దవంగర: సీలింగ్ ఫ్యాన్ కారణంగా ఓ చిన్నారి ప్రాణం కోల్పోయిన సంఘటన పెద్దవంగర మండల పరిధి రామచంద్రుతండాలో మంగళవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రామచంద్రు తండాకు చెందిన జాటోత్ యాకులు, లలితలకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు శ్రావణి (11) నాలుగో తరగతి చదువుతోంది. రోజులాగే అన్నం తిన్నాక పడుకున్నారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడి శ్రావణి తలపై పడింది. ఫ్యాన్ సౌండ్ తో ఉలిక్కి పడ్డ తల్లిదండ్రులు లేచి చూడగా శ్రావణి తలకు గాయాన్ని చూసి హుటాహుటిన తొర్రూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఖమ్మం తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story






