- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూరం భారం తగ్గింది.. మూడ్ తండా వాసులకు చేరువైన రేషన్ సరుకులు!
నర్సింహులపేట మండలంలోని లోక్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రేషన్ షాప్ నెంబర్ 20 ద్వారా సరుకులు తీసుకోవడంలో మూడ్ తండా వాసులకు ఎదురవుతున్న సమస్యలు నేటితో తొలిగిపోయాయి.

దిశ, నర్సింహులపేట : నర్సింహులపేట మండలంలోని లోక్య తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రేషన్ షాప్ నెంబర్ 20 ద్వారా సరుకులు తీసుకోవడంలో మూడ్ తండా వాసులకు ఎదురవుతున్న సమస్యలు నేటితో తొలిగిపోయాయి. లోక్య తండా నుంచి మూడ్ తండాకు దూరం ఎక్కువగా ఉండటం వల్ల, సరుకుల కోసం కాలినడకన లేదా వాహనాల్లో వెళ్లడం మహిళలకు, వృద్ధులకు పెను భారంగా మారింది. ఈ దూరాన్ని, ప్రజల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్, స్థానిక సర్పంచ్ చొరవతో మూడ్ తండా ప్రజల కోసం ప్రత్యేకంగా అక్కడే ఒక కౌంటర్‌ను ఇప్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేందర్ మాట్లాడుతూ.. "దూరం కారణంగా సరుకులు తెచ్చుకోవడానికి ఒక రోజంతా వృధా అయ్యేదని, ఇప్పుడు తండాలోనే కౌంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఆ ఇబ్బంది తప్పిందని" హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ఎమ్మెల్యే ఈ నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జినుకుల రమేష్, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు దస్రు నాయక్, సోషల్ మీడియా మండల కన్వీనర్ చిర్రా సతీష్, లోక్య తండా ఉప సర్పంచ్ భూక్యా రాందాస్, పాల్గొన్నారు.
సర్పంచ్ చొరవపై ప్రజల హర్షం
సమస్యను అర్థం చేసుకుని, ఉన్నతాధికారులతో ఎమ్మెల్యేతో మాట్లాడి తండాకే రేషన్ కౌంటర్‌ను తీసుకువచ్చిన సర్పంచ్ రాజేందర్ పై గ్రామస్తులు ప్రశంసల జల్లు కురిపించారు."గతంలో రేషన్ కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చేది. వర్షాకాలంలో మా ఇబ్బందులు వర్ణనాతీతం. సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మా తండాలోనే సరుకులు అందేలా చేయడం చాలా సంతోషంగా ఉంది" అని తండా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.






