వెనుక బ‌డిన ములుగు జిల్లాను విద్యారంగంలో వెలుగులోకి తేవాలి

by Ratna Kumari |   (  Updated:2026-05-17 12:54:46  IST  )

పాతకాలం నాటి ఆహార అలవాట్లు నేడు బంగారంతో సమానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

వెనుక బ‌డిన ములుగు జిల్లాను విద్యారంగంలో వెలుగులోకి తేవాలి
X

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : పాతకాలం నాటి ఆహార అలవాట్లు నేడు బంగారంతో సమానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వెనుకబడిన ములుగు జిల్లాలు విద్యారంగంలో ముందుకు తీసుకుపోవాలని, రానున్న విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలపాలని అన్నారు. ఆదివారం సాయంకాలం ములుగు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ నేడు విచ్చలవిడిగా లభిస్తున్న ఆహారం తీసుకొని ప్రతి ఒక్కరు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పాతకాలపు నాటి ఆహారపు అలవాట్లను చేసుకొని ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు.


కలలకు పుట్టినిల్లుగా వెలిసిన తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, మన ఊరు మన సిద్ధాంతాలను ఎవరు మర్చిపోవద్దని, సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా ఉంటారని సూచించారు. పసుపు, ఇప్పపువ్వు సహజ సిద్ధంగా లభించే పలు రకాల ఆకులు పండ్లు, పువ్వులు ప్రతి ఒక్కరూ తీసుకున్న పక్షంలో ఎలాంటి వ్యాధులు దరిచేరమని, పరిశుభ్రమైన ఆహారం అందించడానికి మహిళలచే ఆహార క్యాంటిన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈనాటి మొక్కలే రేపటి భవిష్యత్తు అన్న తరహాలో మంచి ఆహారం తీసుకునే విధంగా ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ప్రజా ప్రభుత్వం విద్యను బలోపితం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, పదవ తరగతి పరీక్షల్లో 99. 30 శాతం తో రాష్ట్రంలోనే ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు పదివేల రూపాయల నగతు తో పాటు వారికి ల్యాబ్ టాప్ అందించి సన్మానించడం జరిగిందని, ఉత్తమ ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు చూపిస్తున్న చోరవ ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కలలు నెరవేర్చాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, విద్యాశాఖ అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story