- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాం పాలనను తలపిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు
ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పని తీరును చూస్తే.. నిజాం పాలన తలపిస్తుందని బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాడి రామరాజు నేత అన్నారు.

దిశ, ఏటూరు నాగారం : ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పని తీరును చూస్తే.. నిజాం పాలన తలపిస్తుందని బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాడి రామరాజు నేత అన్నారు. గత ప్రభుత్వాలు మేడారం జాతరను విజయవంతం చేయలేదా..? లేక అడ్వర్టైజింగ్ చేసుకోలేదా కాంగ్రెస్ మంత్రి చెప్పాలనీ రామరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రం లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 16వరకుతెలంగాణ నిజాం పరిపాలన ఉన్నదని.. అప్పుడు జాతర చేస్తే నిజాం పాలకులు ప్రజలను భయబ్రాంతులకు గురి చేసినప్పటికి కూడా ప్రజలు మేడారం జాతర అప్పటి పరిస్థులకు అనుకూలంగా జాతర జరుపుకునేవారు. స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వాలు 1996 వరకు ఏజెన్సీ ప్రాంతం నుండి ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు లేకపోవడం వలన ప్రభుత్వం దృష్టికి మైదాన ప్రాంత నాయకులు, 1952 నుండి ములుగు ప్రాంత వాసులు, ప్రజా ప్రతినిధులు ఉండడం వలన గుర్తించపడలేదు. 1996 లో ఉప ఎన్నికల్లో చర్ప భోజరావు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో మేడారం జాతర ఆదివాసీ కుల దైవం అని చెప్పి ఒప్పించిన తర్వాత ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. తర్వాత పోదేం వీరయ్య ఈ ప్రాంతవాసుల వలన మేడారం జాతర అభివృద్ధి అయ్యింది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది, కానీ మేడారం జాతరకు వచ్చిన నిధులను 75% ములుగు లో ఖర్చు పెడుతున్నారు. 25%నిధులు మాత్రమే మేడారం జాతర లో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాని ఆరోపించారు.
మంత్రి మాటలు కాంగ్రెస్ నాయకులు మేడారం జాతర ను అభివృద్ధి చేయనట్టు.. మాట్లాడుతూ అడ్వర్టైజింగ్ కోసం తపన పడుతున్నారే తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు. గత ప్రభుత్వాలుఅభివృద్ధి చేయలేదా..? లేక గతం లో ఎన్నికైన మంత్రులు ఎమ్మెల్యే లు అడ్వర్టైజింగ్ చేసుకోలేదా పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షమా శాఖ మంత్రి చెప్పాలని అన్నారు. ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వార్గాల వారికీ రాజ్యాధికారం కోసం పోరాటం చేసింది ఎంత నిజమో, మేడారం జాతర అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం కూడ అంతే నిజం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు గత ప్రభుత్వం ఎప్పుడు మేడారం జాతర నిర్వహించలేదు. కానీ ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పోరాటం చేసింది. నేడు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి అయ్యింది. కాబట్టి మేడారం జాతర విజయవంతం చేసిందా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మేడారం జాతర తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిందా లేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేశారో చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలం లో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ యకులు, మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ ఏజెన్సీ ప్రాంతం ను ఎడారి గా మార్చడానికి ప్రయత్నం చేయకండి అని పేర్కొన్నారు. జెండాలు మోయడం మీద ఉన్న అభిమానం ఏటూరు నాగరం బస్సు డిపో, రెవెన్యూ డివిజన్ పై లేకపోవడం బాధాకరం అన్నారు.






