- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముల్కనూరులో వనదేవతల ఆగమనం
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం సారలమ్మ రాత్రి గద్దెను ఎక్కనుండటంతో ముల్కనూర్ గ్రామంలో సందడి నెలకొంది. బుధవారం సాయంత్రం రహస్య పూజలతో సారలమ్మ ఆగమన క్రతువు ప్రారంభమైంది.

దిశ, భీమదేవరపల్లి : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం సారలమ్మ రాత్రి గద్దెను ఎక్కనుండటంతో ముల్కనూర్ గ్రామంలో సందడి నెలకొంది. బుధవారం సాయంత్రం రహస్య పూజలతో సారలమ్మ ఆగమన క్రతువు ప్రారంభమైంది. ప్రధాన పూజారి 3.30 గంటలకు ఆలయానికి బయలుదేరి, సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరి గంటన్నర పూజలు నిర్వహించారు. భక్తులు సాష్టాంగ నమస్కారాలు చేసి అమ్మవారి దీవెనలు పొందారు. భద్రత కోసం పోలీసులు, అభ్యుదయ సంఘ సభ్యులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. సంప్రదాయం ప్రకారం ప్రధాన పూజారి తన సోదరుడు జంపన్నను ముద్దాడి గద్దెపైకి చేరుకుంటారు. తదుపరి ఘట్టంగా గురువారం సాయంత్రం మహాదేవత సమ్మక్కను ప్రతిష్టిస్తారు.
ఇప్పటికే కొండాయి నుంచి గోవిందరాజులు, ముల్కనూరు నుంచి పగిడిద్ద రాజులను గద్దెలపై ప్రతిష్టించారు. సారలమ్మ రాత్రి 9–10 గంటల మధ్య గద్దెలకు చేరనుందని అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం తాగునీరు, వైద్య, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ జక్కుల ఐలయ్య,పెంచికల జెపాల్, గీకురు ఐలయ్య, మాడుగుల యాదగిరి,కొదురుపాక శ్రీనివాస్, పోలీసులు సీఐ పులి రమేష్, ఎస్సై లు ఎం రాజు, దివ్య కార్యదర్శి జంగం పూర్ణచందర్, జక్కుల మల్లికార్జున జక్కుల అనిల్, పోగుల శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.






