ప్రజాపాలన - ప్రగతి బాట బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి

by Ratna Kumari |

ప్రజాపాలన - ప్రగతి బాట బహిరంగ సభ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నార‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

ప్రజాపాలన - ప్రగతి బాట బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : ప్రజాపాలన - ప్రగతి బాట బహిరంగ సభ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గణపురం మండలం చెల్పూరు గ్రామ శివారులో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నార‌ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం సాయంత్రం చెల్పూర్ లోని సభా స్థలిని ఎమ్మెల్యే జీఎస్సార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు ఇతర ముఖ్య నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ రేపు జరిగే బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చెల్పూర్ సభ కంటే ముందు రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. అనంతరం ఆలయంలో రూ.12.15 కోట్లతో చేపట్టిన పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం చెల్పూర్ శివారులో జరిగే ప్రజాపాలన - ప్రగతిబాట బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఒకప్పుడు 600 ఓట్లతో ఉన్న భూపాలపల్లి లక్ష జనాభాతో మున్సిపాలిటీగా, అనంతరం జిల్లా కేంద్రంగా ఏర్పడి విస్తరించిందన్నారు. బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో వారి ఉనికి కోసమే అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా పోతుందనే అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, జిల్లా ఎక్కడికి పోదని, రేపు జరిగే సభలో ముఖ్యమంత్రితో మాట్లాడిస్తానన్నారు. జెన్కో తీసుకొచ్చామని అబద్ధాలు ఆడుతున్నారని, జెన్కో తీసుకొచ్చింది 2006లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 500 మెగా వాట్లు, 2009లో మరో 600 మెగావాట్లను ప్రారంభించినట్లు తెలిపారు. మీలాగా వైట్ పెట్రోల్ దందా, బొగ్గు దందా, ఇసుక దందా.. చేయలేదన్నారు. భూపాలపల్లిలో వందల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన, మున్సిపాలిటీ అభివృద్ధి చేశామని అన్నారు.

Next Story