కొమ్మాల జాతర విజయవంతం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యం

by Naveena |

కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరను విజయవంతం చేయడమే పోలీసు శాఖ వారి లక్ష్యం అని, జాతరలో డీజేలు రికార్డింగ్ డాన్సులు నిషేధమని మామునూరు ఏసీపీ తిరుపతి అన్నారు.

కొమ్మాల జాతర విజయవంతం చేయడమే పోలీస్ శాఖ లక్ష్యం
X

దిశ,గీసుగొండ: కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరను విజయవంతం చేయడమే పోలీసు శాఖ వారి లక్ష్యం అని, జాతరలో డీజేలు రికార్డింగ్ డాన్సులు నిషేధమని మామునూరు ఏసీపీ తిరుపతి అన్నారు. మండలంలోని కొమ్మాల ఆలయం వద్ద విష్ణు ప్రియ గార్డెన్స్ లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో మామునూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకుల నుంచి సలహాలు సూచనలు ఏసిపి తీసుకున్నారు.

జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్ మాట్లాడుతూ..పోలీసు శాఖ వారు ప్రభబండ్ల ప్రవేశం నిష్క్రమణంను నియంత్రిస్తే జాతరలో ఇబ్బంది కలగదని అన్నారు. అన్ని పార్టీల ప్రభలకు పోలీస్ శాఖ వారు కేటాయించిన సమయాన్ని తూచా తప్పకుండా పాటించి భక్తి భావంతో ప్రభలను నిర్వహించి, శాంతియుతంగా జాతరను విజయవంతం చేయాలని కోరారు.

ఎంసీపీఐ నాయకులు గోన కుమారస్వామి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ వారు అన్ని పార్టీల ప్రభలకు సముచిత స్థానం ఇవ్వాలని అన్నారు. అన్ని పార్టీల ప్రభలకు ధమాషా పద్ధతిలో సమయం కేటాయించాలని కోరారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కూతురు రాజు మాట్లాడుతూ.. పోలీస్ శాఖ వారు అధికార ,ప్రతిపక్షం అని తేడా లేకుండా ముందుగా ఏ ప్రభబండి వస్తుందో దానినే జాతరలోకి వెళ్ళనివ్వాలని, అన్ని పార్టీలను ఒకే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా జాతరలో బెల్ట్ షాపులను నియంత్రించాలని పోలీసు వారిని కోరారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు మేడం భరత్ కుమార్ మాట్లాడుతూ.. కొంతమంది నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

రడం భరత్ కుమార్ మాట్లాడుతూ.. నేను పోలీసు శాఖ వారు పిలిస్తేనే ఇక్కడికి వచ్చానని అన్నారు. కొంతమంది నాయకులు లాగా సొంత డబ్బాలు,గప్పాలు కొట్టడానికి రాలేదన్నారు. జాతరలో వ్యాపారులు లాభార్జన కోసం అధిక ధరలు వేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ధరలు నియంత్రించాలన్నారు. జాతరను శాంతియుతంగా నిర్వహించి మిగతా మండలాలకు ఆదర్శంగా ఉండాలని కోరారు. అన్ని పార్టీల నుంచి సూచనలు తీసుకున్న అనంతరం మామునూరు ఏసీపీ తిరుపతి మాట్లాడుతూ..కొమ్మాల జాతరలో సాంప్రదాయంగా వస్తున్న ప్రభబండ్లకు అనుమతిస్తూనే, డీజేలకు రికార్డింగ్ డాన్స్ లకు మాత్రం నిషేధం విధించామన్నారు. పోలీసు శాఖ వారికి అన్ని పార్టీలు సమానమే అని చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నారు. ఎవరు పట్టుదలకు పోకుండా భక్తి భావంతో జాతరను శాంతియుతంగా విజయవంతం చేయాలన్నారు. జాతరలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తామన్నారు. 400 మంది పోలీసు సిబ్బందితో జాతరలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తామని అన్నారు. పదిమందిలో ఎవరో ఒకరు గొడవలకు కారణం అవుతారని , అలాంటి వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. పోలీసు శాఖ వారి సూచనలను పాటించని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసిపి కిరణ్ కుమార్, గీసుగొండ సీఐ మహేందర్, దుగ్గొండి సీఐ సాయిరాం, నర్సంపేట సీఐ రమణమూర్తి, ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు,ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు, ఆలయ అర్చకులు రామాచార్యులు,గీసుగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొమరారెడ్డి, అల్లం మర్రెడ్డి మాజీ సర్పంచులు గోనె మల్లారెడ్డి, దౌడు బాబు, మాజీ ఎంపీటీసీలు బిక్షపతి, వీరారావు, బిజెపి మండల అధ్యక్షుడు చొక్కం శ్రీనివాస్, ముల్క ప్రసాద్, బిఆర్ఎస్ నాయకులు అంకతి నాగేశ్వర రావు,శిరీసే శ్రీకాంత్,ప్రసాద్ ఆయా పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Next Story