అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి కౌలు రైతు మృతి..

by Bhanu |

అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి కౌలు రైతు మృతి..
X

దిశ, మల్హర్ : అప్పుల బాధ భరించలేక గడ్డి మందు తాగి కౌలు రైతు మృతి చెందిన విషాద సంఘటన మల్హర్ మండలం నాచారంలో శనివారం జరిగింది. కొయ్యూరు పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన బండారి దేవేందర్(32) మృతుడు గ్రామస్తుల వద్ద మూడున్నర, నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి గత కొన్ని సంవత్సరాలుగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూనే వాడని మిర్చి పంట దిగుబడి రాక అప్పులు మిగిలిపోవడం వల్ల మానసికంగా కృంగిపోయినట్లు మృతుని భార్య లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.

శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుండి వెళ్లిన భర్త దేవేందర్ ఇంటికి రాకపోవడం గమనించిన భార్య భర్త ఆచూకీ కోసం ఆరా తీయగా ఇంటికి చేరుకున్న మృతుడు దేవేందర్ కుటుంబ సభ్యులకు ఇక టాటా అని చెప్పడం గమనించిన భార్య నిలదీయడంతో గడ్డి మందు తాగాను అని చెప్పడంతో భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే శనివారం ఉదయం మృతి చెందినట్లు ఆమె తెలిపింది. మృతునికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు మృతుని భార్య ఫిర్యాదు మీరు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Next Story