- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవాలయాలే టార్గెట్.. నలుగురు యువకుల అరెస్ట్..
దేవాలయాలను టార్గెట్ చేసుకొని తాళాలు పగలగొట్టి హుండీల సొమ్ము అపహరించే దొంగలను శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, కమలాపూర్: దేవాలయాలను టార్గెట్ చేసుకొని తాళాలు పగలగొట్టి హుండీల సొమ్ము అపహరించే దొంగలను శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో మధ్యాహ్నం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో జమ్మికుంట, హుజురాబాద్ మండలాలకు చెందిన నలుగురు యువకులు జాన బోయిన అరవింద్, గుల్ల ప్రవీణ్, గట్టు మనోజ్, శ్రీరాముల రాజేష్ లు అనుమానాస్పద స్థితిలో కనబడగా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
దీంతో.. నలుగురు యువకులు దేవాలయాలను టార్గెట్ చేసుకొని తాళాలు పగలగొట్టి హుండీలలో ఉన్న సొమ్మును కాజేసే వారని తెలిపారు. ఈ నలుగురు యువకులు ఇటీవల భీంపల్లి, మర్రిపల్లిగూడెం గ్రామాలలో దొంగతనం చేయడమే కాకుండా జమ్మికుంట, దామర, శాయంపేట, ఆత్మకూరు మండలాల్లోని దేవాలయాలలో హుండీలను పగలగొట్టి డబ్బులు దొంగతనం చేశారని విచారణలో తెలిపారన్నారు. నిందితుల వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్స్, 38 వేల నగదును సీజ్ చేయడమే కాకుండా వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు సిఐ హరికృష్ణ తెలిపారు.






