అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న టేకు క‌ల‌ప ప‌ట్టివేత‌..

by Bhanu |

చ‌త్తీస్‌ఘ‌డ్ అట‌వీ ప్రాంతాల నుండి అక్ర‌మంగా తర‌లిస్తున్న సుమారు 6ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌ల విలువైన టేకు కలపను నూగూరు వెంకటాపురం అట‌వీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న టేకు క‌ల‌ప ప‌ట్టివేత‌..
X

దిశ‌, ఏటూరునాగారం: చ‌త్తీస్‌ఘ‌డ్ అట‌వీ ప్రాంతాల నుండి అక్ర‌మంగా తర‌లిస్తున్న సుమారు 6ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌ల విలువైన టేకు కలపను నూగూరు వెంకటాపురం అట‌వీ శాఖ అధికారులు పట్టుకున్నారు. గురువారం వేకువజామున విశ్వసనీయ సమాచారం మేరకు నూగూరు వెంక‌టాపురం అట‌వీ శాఖ రేంజ్ అధికారి సుద్దప‌ల్లి వంశీకృష్ణ ఆధ్వ‌ర్యంలో సెక్ష‌న్, బీట్ ఆఫీస‌ర్లు, బేస్ క్యాంపు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ స‌మ‌యంలో, అలుబాక ప్రధాన రహదారిపై వెళ్తున్న రెండు పికప్ వాహనాలను ఆపి తనిఖీ చేయగా, వాటిలో 4.313 సె.మీ టేకు కలప ఉండటం గుర్తించారు. వెంటనే రెండు వాహనాలను సీజ్ చేసి కలపను వెంక‌టాపురం అట‌వీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఈ కలప విలువ సుమారు 6ల‌క్షల 50 వేల రూపాయ‌లు ఉంటుందని రేంజ్ అధికారి వంశీకృష్ణ తెలిపారు. ఈ దాడిలో అట‌వీ శాఖ సిబ్బంది చురుగ్గా పాల్గొని కలప స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు.

Next Story