అక్ర‌మ క‌ల‌ప ప‌ట్టివేత‌

by Bhanu |

అక్ర‌మంగా నిల్వ‌చేసి త‌ర‌లించేందుకు అట‌వీ ప్రాంతంలో నిల్వ చేసి ఉంచిన 10 టేకు దుంగల‌ను నూగూరు వెంక‌టాపురం అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకుని స్వాధీన ప‌రుచుకున్నారు.

అక్ర‌మ క‌ల‌ప ప‌ట్టివేత‌
X

దిశ‌, ఏటూరునాగారం : అక్ర‌మంగా నిల్వ‌చేసి త‌ర‌లించేందుకు అట‌వీ ప్రాంతంలో నిల్వ చేసి ఉంచిన 10 టేకు దుంగల‌ను నూగూరు వెంక‌టాపురం అట‌వీ శాఖ అధికారులు ప‌ట్టుకుని స్వాధీన ప‌రుచుకున్నారు. నూగూరు వెంక‌టాపురం అటవీ శాఖ రేంజ్ అధికారి వంశీకృష్ణ క‌థ‌నం మేర‌కు..న‌మ్మ‌ద‌గిన స‌మాచారం మేర‌కు చ‌త్తీస్ ఘ‌డ్ స‌రిహ‌ధ్దు అటవీ ప్రాంతంలోని నూగూరు వెంక‌టాపురం అట‌వీ రేంజ్ ప‌రిదిలోని సూర‌వీడున బీటు, ఏదిర సెక్ష‌న్ అడ‌వీలో అట‌వీ శాఖ సిబ్బంది అక‌స్మీక దాడులు చేసి అక్ర‌మంగా త‌ర‌లించ‌డానికి నిల్వ చేసి ఉంచిన 10 టేకు దుంగ‌ల‌ను స్వాధీన ప‌రుచుకుని వెంక‌టాపురం అట‌వీ శాఖ కార్య‌ల‌యంకు త‌ర‌లించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. అక‌స్మీక దాడుల‌లో స్వాధీన ప‌రుచుకున్న క‌ల‌ప విలువ సుమారు 3 ల‌క్ష‌ల 70 వేలు ఉంటుంద‌ని అయ‌న తెలిపారు. కొంత మంది స్మ‌గ్ల‌ర్లు టేకు దుంగ‌ల‌ను ముక్కులుగా చేసి త‌ర‌లించ‌డానికి నిల్వచేసార‌నే స‌మాచారంతోనే ఈ దాడులు నిర్వ‌హించ‌మ‌న్నారు. ఈ ఆక‌స్మీక దాడుల‌లో ఏదిర సెక్ష‌న్ అధికారి జై సింగ్‌, సూర‌వీడు సౌత్ బీట్ ఆఫీస‌ర్ స్వ‌ర్ణల‌త‌,సూర‌వీడు సెక్ష‌న్ అధికారి చంద్ర‌మోహ‌న్‌, బేస్ క్యాంపు సిబ్బంది త‌దిత‌రులు పాల్గోన్నారు.


Next Story