విద్యార్థుల విజయాలతో గర్వపడుతున్న గురువులు

by Ratna Kumari |

హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు.

విద్యార్థుల విజయాలతో గర్వపడుతున్న గురువులు
X

దిశ, ధర్మసాగర్ : హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం అత్యంత ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల తర్వాత ఒకేచోట చేరిన పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల ప్రాంగణం పాత స్నేహాలు, నవ్వులు, ఆనందాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశంలోని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో కొనసాగడం తమకు అపార గర్వకారణమని తెలిపారు. ముఖ్యంగా తమ విద్యార్థి షోడశపల్లి గ్రామానికి చెందిన మామిడల మహేందర్ రెడ్డి హైదరాబాద్‌లో అత్యున్నత స్థాయిలో ఎదిగి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ఈ బ్యాచ్‌కు చెందిన మరికొందరు పూర్వ విద్యార్థులు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కీలక పదవుల్లో కొనసాగుతూ సమాజానికి సేవలందిస్తున్నారని ప్రశంసించారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ జీవితానికి పునాది వేసింది ఈ పాఠశాలేనని, గురువుల క్రమశిక్షణ, బోధన వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని కృతజ్ఞతాభావంతో పేర్కొన్నారు. తమకు విద్య అందించిన పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ ఆత్మీయ సమ్మేళనం పాత అనుబంధాలను మరింత బలపరుస్తూ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.గురువులు శుకురు, కిష్టయ్య, శ్రీదేవి లను సత్కరించి సన్మానం చేశారు.

Next Story