ప‌ర‌కాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ

by Ratna Kumari |

ప‌ర‌కాల మున్సిప‌ల్ చైర్మ‌న్ గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మ‌న్ గా ఏకు దివ్య విద్యాసాగ‌ర్ ను ఎన్నుకున్నారు.

ప‌ర‌కాల మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మ‌న్  బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ
X

దిశ‌, ప‌ర‌కాల : ప‌ర‌కాల మున్సిప‌ల్ చైర్మ‌న్ గా పావుశెట్టి సునీల్, వైస్ చైర్మ‌న్ గా ఏకు దివ్య విద్యాసాగ‌ర్ ను ఎన్నుకున్నారు. వీరు ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప‌ర‌కాల మున్సిపాలిటీ ప‌రిధిలో మొత్తం 22 వార్డుల‌కు 13 వార్డులు కాంగ్రెస్, బీఆర్ఎస్ 6, బీఆర్ఎస్ మూడు బీజేపీ గెలుపొందింది.దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ కైవ‌సం చేసుకుంది. దీంతో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం ముందు నుంచి ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డితో పాటు మున్సిప‌ల్ చైర్మ‌న్ సునిల్, వైస్ చైర్మ‌న్ దివ్య విద్యాసాగ‌ర్, కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌లో భారీ ర్యాలీని బ‌స్టాండ్ మీదుగా పోచ‌మ్మ గుడి నుంచి అంబేద్క‌ర్ సెంట‌ర్ వ‌ర‌కు బ్యాండ్ వాయిదాల‌తో అత్యంత రంగ రంగ వైభ‌వంగా ర్యాలీ నిర్వ‌హించారు.

Next Story