- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమాదస్పద స్థితిలో వివాహిత మృతి..
శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన అబ్బోజు హేమలత అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. ఈ ఘటనపై శాయంపేట సీఐ పి.రంజిత్ రావు ఇచ్చిన వివరాల ప్రకారం, హేమలత భర్త అబ్బోజు రాజా చారి (35) భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతూ అఘాయిత్యాలకు పాల్పడేవాడని తెలిపారు.

దిశ, పరకాల (శాయంపేట) : శాయంపేట మండలం కొప్పుల గ్రామానికి చెందిన అబ్బోజు హేమలత అనుమానాస్పద స్థితిలో శనివారం సాయంత్రం మృతిచెందింది. ఈ ఘటనపై శాయంపేట సీఐ పి.రంజిత్ రావు ఇచ్చిన వివరాల ప్రకారం, హేమలత భర్త అబ్బోజు రాజా చారి (35) భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవ పడుతూ అఘాయిత్యాలకు పాల్పడేవాడని తెలిపారు.
సమాచారం ప్రకారం, నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాంతో రాజా చారి హేమలతపై దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెకు అస్వస్థతత కలగగా, రెండు రోజుల క్రితం గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ ఇప్పించాడు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎం.జి.యం. ఆసుపత్రికి, అనంతరం శ్రీ చక్ర ఆసుపత్రికి తరలించారు. అయితే హేమలత చికిత్స పొందుతూ జూన్ 21, శనివారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మృతి చెందారు.
ఈ ఘటనపై మృతురాలి పెద్ద కుమార్తె గాదే శివాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్ వేసిన కారణంగానే తల్లి మృతి చెందినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ శాయంపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సీఐ రంజిత్ రావు తెలిపారు.






