- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kakatiya University : కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల వీరంగం
కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో విద్యార్థులు వీరంగం(Students Fight) సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University)లో విద్యార్థులు వీరంగం(Students Fight) సృష్టించారు. వర్సిటీలో సీనియర్లకు జూనియర్లకు మధ్య ర్యాగింగ్ గొడవలు జరుగుతున్నాయి అనడానికి ఈ గోడవలే నిదర్శనం. మద్యాహ్నం భోజన సమయంలో సీనియర్లకు, జూనియర్లకు తలెత్తిన చిన్న వివాదం.. క్రమంగా చిలికి చిలికి గాలివానగా మారి.. దాడులకు తెగబడే వరకు వెళ్ళింది. ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం విద్యార్థులు తమకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటూ.. మధ్యాహ్న భోజన సమయంలో మెస్ లో సీనియర్ విద్యార్థులు వారితో గొడవకు దిగారు. అది కాస్త పెద్ద గొడవగా మారి ప్లేట్లతో కొట్టుకున్నారు. కాగా మెస్ నిర్వహకులు జోక్యం చేసుకున్నప్పటికీ విద్యార్థులు శాంతించకపోవడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణగగా.. మరోసారి ఇలాంటి గొడవలకు పాల్పడితే ఊరుకునేది లేదని విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఘటనపై వర్శిటీ అధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. గొడవకు పాల్పడిన విద్యార్థులకు నోటీసులు జారీ చేసి.. వారిని వర్శిటీ నుంచి సస్పెండ్ చేయనున్నారని సమాచారం.






