- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సంపేటలో రాళ్ళ దాడి.. ఇంతకీ ఏమైనట్టు..?
నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు వైపు ఓ వెంచర్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డు వైపు ఓ వెంచర్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూమి మాదీ అంటే.. కాదు మాదీ అంటూ ఇరు వర్గాలు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి. స్ధానిక ఎస్సై రవికుమార్ కి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.
నర్సంపేట పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలోని సర్వే నెంబర్ 111లో గత కొన్ని రోజులుగా చర్చలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టుకు సైతం ఇరు పక్షాలు వెళ్లారు. గడచిన కొన్ని రోజులుగా ఇరు పార్టీల మధ్య వివాదం ముదిరి తారాస్థాయికి చేరుకుంది. నేడు ఇరు వర్గాలకు చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారని అడ్డుకోవడంతో ..ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదర గొట్టారు. జనాలను చెదరగొట్టే క్రమంలో స్థానిక ఎస్సై రవికుమార్ కి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ సండే సంఘటన స్థలంలో ఇరువర్గాలతో మాట్లాడే సమస్యను సద్దుమణిగి ప్రయత్నం చేస్తున్నారు.






