- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసముద్రంలో రాష్ట్ర స్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలు ప్రారంభం
కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వేం వెంకట కృష్ణా రెడ్డి, వేం పురుషోత్తం రెడ్డి ల జ్ఞాపకార్ధంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

దిశ, కేసముద్రం : కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వేం వెంకట కృష్ణా రెడ్డి, వేం పురుషోత్తం రెడ్డి ల జ్ఞాపకార్ధంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మోడ్రన్ కబడ్డీ రూపకర్త, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల అవసరం ఉందని, క్రీడలతో వికాసం కలుగుతుందన్నారు. కేసముద్రం మండలంలో అనేక క్రీడా ప్రతిభావంతులు ఉన్నారని, గతంలో రాజకీయాలకు అతీతంగా అందరి సహకారంతో అనేక క్రీడా పోటీలను నిర్వహించిన అనుభవం మరిచిపోలేనిదన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో మండల, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మంచి స్థానం లభించినందుకు, మండల, నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధిలో అండగా ఉంటానని అన్నారు. కేసముద్రం మండలంలో పలు రకాల కళాశాలల ఏర్పాటుతో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని, మండల కేంద్రంలో చేపట్టనున్న రోడ్ల విస్తరణ ప్రజల అభివృద్ధి కోసమేనని గ్రహించాలన్నారు.
సంక్షేమం, అభివృద్ధి సమపాలలో జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా రాజకీయాలకతీతంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కావలసిన రెండు కోట్ల ప్రహరీ గోడ నిర్మాణానికి అనుమతులను ఇప్పించినందుకు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కబడ్డీ పోటీల ప్రారంభానికి విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త వద్దిరాజు కిషన్, మార్కెట్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ మర్రి రంగారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, పీసీసీ సభ్యులు దశ్రు నాయక్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బండారు వెంకన్న తదితరులు సరస్వతీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అలాగే ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తండ్రి వెంకట కృష్ణారెడ్డి, సోదరుడు వేం పురుషోత్తం రెడ్డిల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని సుమారు 28 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమావేశ అనంతరం క్రీడాకారులను వేం నరేందర్ రెడ్డి తదితరులు పరిచయం చేసుకొని వారితో కలిసి కబడ్డీ ఆడారు. పాఠశాల విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నూనావత్ రాధ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట వెంకన్న, మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ప్రధానోపాధ్యాయులు రాజు, బండారు నరేందర్, పీఈటీలు కొమ్ము రాజేందర్, చెడుపల్లి ఐలయ్య, కొప్పుల శంకర్, మార్కెట్ డైరెక్టర్లు, ఓలం రాజు, మురళీ, కృష్ణుడు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






