సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలి

by velandi.Saikiran |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు.

సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చివరి లబ్ధిదారుని వరకు చేరాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, ప్రజా చైతన్యానికి సంబంధించిన సానుకూల అంశాలను ప్రజలకు చేరవేయడంలో మీడియా బాధ్యత ఎంతో కీలకమని అన్నారు. ప్రజల్లో బాధ్యత, సామాజిక చైతన్యం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన పెంచేందుకు మీడియా నిరంతరం కృషి చేయాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనను ప్రజా ఉద్యమంగా మార్చడంలో మీడియా కీలక భాగస్వామిగా ఉండాలన్నారు. ప్రభుత్వం, ప్రజలు, మీడియా సమిష్టిగా కృషి చేసినప్పుడే డ్రగ్స్ రహిత భారత్ – డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం సాకారమవుతుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, సిపి శ్వేతా,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story