జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లో మెరిసిన శ్రీనిక

by Ratna Kumari |

టేకుమ‌ట్ల మండ‌ల కేంద్రంలోని వాట్ప‌ల్లి సంతోష్ కుమార్, హిరీష దంప‌తుల కుమార్తె శ్రీనిక అంత‌ర్జాతీయ స్థాయికి ఎంపిక అయింది.

జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ లో మెరిసిన శ్రీనిక
X
దిశ, టేకుమట్ల : టేకుమ‌ట్ల మండ‌ల కేంద్రంలోని వాట్ప‌ల్లి సంతోష్ కుమార్, హిరీష దంప‌తుల కుమార్తె శ్రీనిక అంత‌ర్జాతీయ స్థాయికి ఎంపిక అయింది. దీంతో కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మే 09న కేరళలో నిర్వహించిన జేఎంఐ (జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్) సీజన్–10 పోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతిని గెలుచుకుంది శ్రీనిక‌. ఆగస్టు నెలలో బ్యాంకాక్‌లో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలకు సిద్ధంగా ఉంది. భారతదేశం నుంచి ముగ్గురు మాత్రమే ఎంపిక కాగా, వారిలో శ్రీనిక ఒకరిగా నిలవడం విశేషం. త‌మ‌ మనవరాలు ఈ ఘనత సాధించడం పట్ల అమ్మమ్మ హేమలత, తాతయ్య అల్లే నాగేందర్ హర్షం వ్యక్తం చేస్తూ శ్రీనికను అభినందించారు.
Next Story