- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి శ్రీధర్ బాబు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

దిశ, మల్హర్( మహాదేవ్పూర్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని ఎల్కేశ్వరం గ్రామంలో ఓ లబ్ధిదారునికి మంజూరైన ఇందిరమ్మ ఇల్లును మంత్రి శంకుస్థాపనకు భూమి పూజ చేసి ప్రారంభిస్తూ మాట్లాడారు. ఇల్లు లేని నిరుపేదలకే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ పథకం ద్వారా స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరమ్మ అన్న సందేశం గరీబ్కు ఘర్ బనావో ఆమె కన్న కలలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని పేదవర్గాలకు గౌరవప్రదమైన జీవన వాతావరణాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం ద్వారా నివాస అవసరాలను తీర్చడమే కాదు, మెరుగైన మౌలిక వసతులు కూడా కల్పించనున్నామని తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు ప్రతి కుటుంబానికి ఇల్లు మౌలిక వసతులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో నాణ్యత, సమయ పాలన పాటించాలని సూచించారు. మహదేవ్పూర్ లోని బొమ్మపూర్ ఎక్స్ రోడ్ వద్ద కారు ఆటో డీ కొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న రాపెళ్లికోటకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాలాడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ లో భాగంగా అటువైపు వెళుతున్న మంత్రి శ్రీధర్ బాబు కంటపడడంతో తన మానవత్వాన్ని చాటుకున్నాడు.క్షతఘాత్రులు వేల్పుల మౌనిక, బొగ్గుల శైలజ, సుజాతలలు గాయపడిన మహిళలను తన ఎస్కార్ట్ వాహనంలో హుటాహుటిన మహాదేవపూర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి మంత్రి ఆదేశించారు. అనంతరం భూమి పూజకు వెళ్తున్న ఆయన వెంట కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఎంపిడిఓ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడ్, మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోట రాజబాబు తో పాటు పలువురు ఉన్నారు.






