- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగల పట్టివేతకు ప్రత్యేక బృందాలు
చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు.

దొంగల పట్టివేతకు ప్రత్యేక బృందాలు
సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలి
నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
విధుల నిర్వహణలో పోలీసులు అలసత్వం వహించొద్దు
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
దిశ వరంగల్ బ్యూరో: చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నిందితులు దేశంలో ఎక్కడ వున్నా అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. నిందితులను అరెస్టు చేయడంలో స్టేషన్ అధికారులు అలసత్వం వహించొద్దని సూచించారు. నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వాయ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల ప్రస్తుత స్థితిగతులపై వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్ కేసులను ట్రాఫిక్ పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్లలో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కల పెంపకంతో పాటు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకోసం వారంలో ఒక రోజు శ్రమదానం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, వరంగల్, జనగాం ఏఎస్పీలు శుభం, చేతన్ నితిన్, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి, సురేష్‌కుమార్, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.






