ముంచిన మొక్కజొన్న

by velandi.Saikiran |   (  Updated:2026-03-17 22:46:07  IST  )

ఏజెన్సీలో రైతులు అమాకత్వమే పెట్టుబడిగా బహుళ జాతి కంపెనీలు, ఆర్గనైజర్లు పెట్టుబడి, అధిక ధర ఆశచూపి వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయించి నట్టేటా ముంచుతున్నారు.

ముంచిన మొక్కజొన్న
X

ముంచిన మొక్కజొన్న

=అధిక ధర ఆశ చూపి నట్టేట ముంచారు

=ఏజెన్సీలో ఐటెక్ మోసం

=నకిలీ విత్తనాలతో రైతులు బలి

=న్యాయం చేయాలని వాజేడు రైతులు వేడుకోటు

దిశ, వెంకటాపురం(నూగూరు)/వాజేడు : ఏజెన్సీలో రైతులు అమాకత్వమే పెట్టుబడిగా బహుళ జాతి కంపెనీలు, ఆర్గనైజర్లు పెట్టుబడి, అధిక ధర ఆశచూపి వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయించి నట్టేటా ముంచుతున్నారు. వారి మాటలు నమ్మి సాగు చేసిన రైతులు అప్పుల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించిన రైతులకు మాత్రం చివరికి నిరాశే మిగులుతుంది. ఇలాంటి ఘటనే ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటు చేసుకుంది. స్థానిక రైతులను ఓ బహుళజాతి కంపెనీ టన్నుకి ఒక రకం రూ.28వేలు, మరో రకం టన్నుకి రూ.30వేలు చెల్లించి తామే కొనుగోలు చేస్తామంటూ మాయమాటలు వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయించారు. టన్నుకు ధర ఎక్కువ చెల్లించడం, గతేడాది మిర్చి పంట ఆశాజానకంగా లేకపోవడంతో రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపారు. పంటకాలం పూర్తయ్యాక మొక్కజొన్న విరుపుకి వచ్చేసరికి కంకులకు గింజలు సరిగా లేకపోవడంతో కంపెనీ మాటలు నమ్మి మోస పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విత్తనాలు నమ్ముకొని సాగుచేసిన రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులు, రాజకీయ నాయకులను వేడుకుంటున్నారు.

కంపెనీ మాటలు నమ్మి నష్టపోయా..

గతంలో మిర్చి సాగు చేసేవాడి. నష్టాలు రావడంలో ఈ ఏడాది మొక్కజొన్న విత్తనాలు వాళ్లే ఇచ్చి టన్నుకు అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్నారు. ఎకరాకు మూడు నుండి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందన్నారు. పది ఎకరాల్లో ఐటెక్ మొక్కజొన్న సాగు చేశా. పంట చేతికి వచ్చేసరికి అసలు కంకుల్లో గింజలు లేవు. ఎకరాకు టన్ను కూడా వచ్చే పరిస్థితి లేదు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలి.

–రైతు, మెట్టిపల్లి గోపాల్

Next Story