- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటలో మొదలైన క్యాంప్ రాజకీయలు
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్ది గెలిచే అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి.

దిశ, మహాబూబాబాద్: మాను"కోట"లో పోలింగ్ ముగిసింది..ఇవాళ ఫలితాలు వెలువడుతూ ఉండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. కౌంటింగ్‌కు ముందే పార్టీల లెక్కలు, అంచనాలు చర్చనీయాంశమవుతున్నాయి. స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవచ్చన్న సంకేతాలతో క్యాంప్ రాజకీయాలు షురూ అయ్యాయి. బీఆర్ఎస్ కు కమ్యూనిస్టుల సపోర్ట్ ఉండగా బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ కు స్వతంత్రులు మద్దతు ఇస్తారా లేదా అన్న డైలమా నెలకొంది. మెజార్టీకి దూరంలో ప్రధాన పార్టీలు ఉండడం అధికార, ప్రతిపక్ష పార్టీల్ని కలవరానికి గురి చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.
పార్టీల మధ్య అంతర్గత విభేదాల ప్రభావం
కొన్ని వార్డుల్లో కాంగ్రెస్‌లో వర్గపోరు ప్రభావం చూపిందన్న చర్చ వినిపిస్తోంది. నేతల మధ్య సమన్వయం లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీగా ఉన్నప్పటికీ స్థానిక అసంతృప్తి ఫలితాలపై ప్రభావం చూపుతుందా అన్నది చూడాల్సి ఉంది. అటు బీ.ఆర్.ఎస్ లోనూ అలాంటి వ్యవహారమే గుట్టు చప్పుడు కాకుండా సాగిందని అంటున్నారు.
మెజార్టీకి దూరంలో ప్రధాన పార్టీలు.. హంగ్ కే ఛాన్స్.!
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా మెజార్టీకి 19 స్థానాలు అవసరం. స్థానికంగా వినిపిస్తున్న అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు 14, కాంగ్రెస్ కు 12 స్థానాలు, దక్కే అవకాశం ఉందని ప్రచారం. సిపిఐ 03, సిపిఎం 02, బిజెపి 01, స్వతంత్రులు 04, వార్డుల్లో ముందంజలో ఉండే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ లెక్కలు నిజమైతే ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించదు. దీంతో మద్దతు రాజకీయ సమీకరణాలు తెరమీదకి వచ్చే అవకాశం ఉంది.బిఆర్ఏస్ కి సిపిఐ, బిజెపి మద్దతిచ్చే అవకాశం ఉండగా, కాంగ్రెస్ కు సిపిఎం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. స్వతంత్రులు నాలుగు నుండి ఐదు స్థానాల్లో గెలిచి అవకాశముండడంతో వారే కింగ్ మేకర్ గా మారనున్నట్టు టాక్ వినబడుతోంది. అలాగే ఎక్స్ -అఫీషియో ఓట్లు కూడా కీలకం కానున్నాయి.అధికార పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ , రాజ్యసభ బలం పుష్కలంగా ఉంది. తుది అంకంలో ఈ అదనపు ఓట్లపై ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.
మొదలైన క్యాంప్ రాజకీయలు.. అభ్యర్థుల కట్టడి...ముట్టడి.!
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్ది గెలిచే అభ్యర్థులు చేజారకుండా ఉండేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్,ఎమ్మెల్యే మురళి నాయక్ లు ఆ పార్టీ అభ్యర్థులను బస్సులో మానుకోట శివారులోని ఓ ప్రాంతానికి గురువారం రాత్రి తరలించారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠత నెలకొంది.






